బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (15:32 IST)

సబ్జా తులసితో అవన్నీ నిరోధించవచ్చు... ఏంటవి?

ఒక ప్రత్యేకమైన సువాసన గల మొక్క సబ్జా తులసి. అందుకే దీన్ని ఔషధ మొక్కలలో రారాజు అంటారు. ఈ మొక్క అన్ని భాగాలు ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. మొక్కనుంచి సువాసనతో కూడిన తైలం (ఆరోమాటిక్ ఆయిల్) తీయవచ్చు. ఈ మొక్కను స్వీట్ బాసిల్, కామ కస్తూరి, విభూతి పత్రి అని రకరకాలుగా పిలుస్తారు. దీంట్లో బీటాకెరోటిన్, మెగ్నీషియం, విటమిన్ కె, పొటాషియం, క్యాల్షియం ఉన్నాయి. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. జోరియాంటిన్ వైసెనిన్ అనే ఫ్లావొనాయిడ్స్ ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి జీవకణాల పతనాన్ని నిరోధిస్తుంది.
 
ప్రయోజనాలు :
* ఒళ్లు నొప్పులకు, వాపుల నుంచి ఉపశమనాన్నిస్తుంది. 
* చలువ కలుగజేస్తుంది. శెగరోగ నివారణిగా పనిచేస్తుంది. 
* ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. 
* గనేరియా, పైల్స్ నివారణకారిగా పనిచేస్తుంది. 
 
* దగ్గు, జలుబు, జ్వరాలను తగ్గిస్తుంది. 
* మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. 
* రక్తవిరేచనాల నియంత్రణకు ఉపయోగపడుతుంది.