శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (16:51 IST)

నిద్ర పట్టడం లేదా.. అయితే, ఇలా చేయండి...

చాలామందికి రాత్రి వేళల్లో నిద్రపట్టదు. మరికొందరు బాగా పొద్దుపోయాకగానీ నిద్రకు ఉపక్రమించలేదు. ఇలాంటి వారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చట. ఆ టిప్స్ కూడా చిన్నవే.. ఎడమ ముక్కు

చాలామందికి రాత్రి వేళల్లో నిద్రపట్టదు. మరికొందరు బాగా పొద్దుపోయాకగానీ నిద్రకు ఉపక్రమించలేదు. ఇలాంటి వారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చట. ఆ టిప్స్ కూడా చిన్నవే.. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చడం, కనురెప్పలు మూసి కనుగుడ్లను గుండ్రంగా తిప్పడమే. ఏంటి వినేందుకు సిల్లీగా ఉన్నా.. ఇది నిజం. ఇలా చేయడం వల్ల సులభంగా నిద్రపడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ఎడమ ముక్కు నుంచి శ్వాస పీల్చడం.. ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్‌ వేడి సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది.
 
అలాగే, కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు... వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటనవేళ్లను పాదం కిందకి అదిమేలా వంచి యథాస్థితికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర తానంతట అదే వచ్చేస్తుంది. 
 
ఇక కళ్లు మూసుకుని కనుగుడ్లను మూడుసార్లు గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయడం ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అంతేకాకుండా మెలటోనిన్‌ అనే నిద్ర హార్మోన్‌ కూడా విడుదలవుతుంది. 
 
మరుసటి రోజు మనం చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తుచేసుకుంటే నిద్రరాదు. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్‌ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాయాలి. ఇలా చేయడం వల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రలోనుంచి పక్కకు నెట్టేయొచ్చు. బుర్రలో ఆలోచనల భారం దిగిపోయాక నిద్ర రాకపోవడం అనే సమస్యే తలెత్తదు.