శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 మార్చి 2021 (23:45 IST)

గొంతు బొంగురుపోతుందా? ఐతే ఇలా చేస్తే సరిపోతుంది...

తులసి రసం కొంచెం తేనెలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటుంటే బొంగురుపోయిన కంఠం చక్కగా అవుతుంది. తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి పూసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి. 
 
మామిడి ఆకుల నుంచి తీసిన పసరు కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.
 
పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకుని ప్రొద్దుటే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. 
 
వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎలాంటి మచ్చలైనా త్వరగా పోతాయి. 
 
ఒక కప్పు వేపాకులు కొద్దినీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడగట్టి ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రిజెంటులా పనిచేస్తుంది. 
 
వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది. రాత్రిపూట దిండు మీద తలసి ఆకులు వుంచుకుని పడుకుంటే తలలో పేలు మాయమవుతాయి.