గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (10:25 IST)

మొలకెత్తిన విత్తనాలతో ప్రయోజనాలెన్నో...

మొలకెత్తిన విత్తనాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన విత్తనాలను వాడటం వల్ల మన ఆరోగ్య పోషణకు దోహదచేస్తాయి. వీటిని ఆహారంలో కలిపి తీసుకోవాలి.

మొలకెత్తిన విత్తనాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన విత్తనాలను వాడటం వల్ల మన ఆరోగ్య పోషణకు దోహదచేస్తాయి. వీటిని ఆహారంలో కలిపి తీసుకోవాలి. విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమేకాకుండా కొన్ని పోషకాలను సృష్టిస్తాయి.
 
మన ఆహారంలో సాధారణంగా వాడే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు ఎక్కువగా వుంటాయి. పప్పులు, ధాన్యలలో మాంసకృత్తులు ఉంటాయి. మొలకెత్తినప్పుడు నీటిలోని మాంసకృత్తులలో మార్పువచ్చి నాణ్యత పెరుగుతుంది. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి అత్యవసర ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది. ఈ విధంగా మాంసకృత్తులు శరీరంలో సులభంగా జీర్ణమై శరీర పోషణకు తోడ్పడతాయని న్యూట్రిషిస్టులు చెబుతారు.