1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (10:01 IST)

స్ట్రాబెర్రీలను తరుచుగా తీసుకుంటే? హార్మోన్స్ ఉత్పత్తికి....

స్ట్రాబెర్రీలు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని ఎవరు ఇష్టపడనివాడుండరు. ఈ స్ట్రాబెర్రీలలో పోషక గుణా పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతుంది. మరి

స్ట్రాబెర్రీలు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని ఎవరు ఇష్టపడనివాడుండరు. ఈ స్ట్రాబెర్రీలలో పోషక గుణా పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతుంది. మరి  ఈ స్ట్రాబెర్రీలలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
స్ట్రాబెర్రీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించడంలో మంచిగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీలు బాగా పనిచేస్తాయి. 100 గ్రాముల స్ట్రాబెర్రీలను తీసుకుంటే కేవలం 33 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందువలన క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయనే దిగులు లేకుండా నిర్భయంగా వీటిని రోజూ తీసుకోవచ్చును.
 
జీర్ణ సమస్యలతో సతమతమయ్యే వారు స్ట్రాబెర్రీలను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుటకు ఈ స్ట్రాబెర్రీలు చాలా ఉయోపడుతాయి. హార్మోన్ల పనితీరును క్రమబద్దీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉంటుంది. ఇవి అడిపోనెక్టిన్ అనే హార్మోన్స్‌ను ఉత్పత్తి చేస్తాయి.