శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (19:04 IST)

స్వైన్ ఫ్లూ: గర్భిణీలకు జాగ్రత్తలు ఇవిగోండి!

* హెచ్1ఎన్1 వైరస్ ఉందని నిర్ధారణ అయితే ఆ గర్భిణీలు సపోర్టివ్ చికిత్సతో పాటు యాంటీ వైరల్ చికిత్స కూడా ఇప్పించాలి.
* స్వైన్ ఫ్లూ ఉన్న గర్భిణీలు లేని గర్భిణీలకు దూరంగా ఉండాలి
*  గదిలో గాలి ధారాళంగా ఉండాలి. 
 
* శిశువును తల్లి నుంచి వేరు చేయకూడదు. తల్లి దగ్గరే శిశువుకు రక్షణ ఉంటుంది. 
*  తల్లి పాలలో ఇన్ఫెక్షన్‌తో పాటు దాన్నుంచి రక్షణ కల్పించే యాంటీ బాడీలు కూడా ఉంటాయి. కాబట్టి తల్లి పాలను మాత్రమే శిశువునకు పట్టించాలి. 
 
*  ఈ వ్యాధి ఉందని అనుమానం వచ్చినప్పుటు ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే వైద్యం ప్రారంభించాలి. 
*  గర్భిణి ప్రసవించేటప్పుడు చిందే రక్తం, ఉమ్మనీటి ద్వారా కూడా స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
*  హెచ్1ఎన్1 టీకా స్వైన్ ఫ్లూను నయం చేయగలదు. ఈ టీకాను గర్భిణీలకు ఇప్పించటానికి కొన్ని నియమాలు పాటించాలి 
 
*  ఇనాక్టివేటెడ్ లేక నిర్జీవ టీకా మాత్రమే వేయాలి. 
*  గర్భిణీలు మొదటి మూడు నెలల్లో టీకా వేయించుకోకూడదు. 
*  4 నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి టీకా వేయించుకుంటే తల్లితో పాటు శిశువుకు కూడా స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.