శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:41 IST)

స్వైన్ ఫ్లూ లక్షణాలేంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. 
 
పిల్లలకు జ్వరం తగ్గిన వెంటనే బడికి పంపకుండా ఒకటి, రెండు రోజులు ఇంట్లోనే ఉంచడం మంచిది. స్వైన్ ప్లూ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రోజుకు పది గ్లాసుల నీరు సేవించండి. దీని మూలంగా శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. దీని మూలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎక్కువసార్లు చేతుల్ని శుభ్రం చేసుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు కచ్చితంగా అడ్డం పెట్టుకోవాలి. మాస్కులు వాడటం మంచిది. అలాగే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. దీనితో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారంలో విటమిన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.