Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..

హైదరాబాద్, సోమవారం, 20 మార్చి 2017 (07:54 IST)

Widgets Magazine

టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్‌ టీ గానీ, గ్రీన్‌ టీ లేదా సాధారణ చాయ్‌ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్‌ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్‌ తగ్గుతాయని నేషనల్‌  యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కు చెందిన డాక్టర్‌ ఫెంగ్‌ లీ పేర్కొంటున్నారు. 
 
అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అలై్జమర్స్, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్‌పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును ‘ఛేయ్‌’ అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ ఫెంగ్‌ లీ! కాకపోతే ఒక షరతు.... ఈ చాయ్‌ జాయ్‌ హాయ్‌లు రోజుకు మూడు కప్పులకు మించకూడదంటూ పరిమితి పెడుతున్నాడు డాక్టర్‌ లీ!!
 
జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా.. మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే! టీని వాసన పీలుస్తూ తాగండి చాలు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి చిన్నారులకు తినిపిస్తే?

బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాల మీద పెట్టడం వల్ల అని త్వరగా ...

news

డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస మేలు..

డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస కాయను అధికంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ...

news

వేరుశెనగ నూనెను వాడండి.. అంటువ్యాధులను దూరం చేసుకోండి..

వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ ...

news

అరలీటర్‌ నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి?

వేసవిలో దానిమ్మ పండ్ల రసంలో పంచదార కలిపి లేత పాకంగా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల మోతాదులో ...

Widgets Magazine