శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2016 (09:23 IST)

పాల ఉత్పత్తులతో రక్తపోటుకు చెక్..

రక్తపోటును నియంత్రించాలంటే శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకుగాను రక్తపోటు సమస్య ఉన్నవారు రోజూ క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగు రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించవచ్చు. అలాగే రక్తపోటు గల వారు ప్రతిరోజూ ఆరోగ్య నిబంధనల ప్రకారం 3,500 మిల్లీ గ్రాముల పొటాషియం శరీరానికి అందించాల్సి ఉంటుంది. 
 
శరీరానికి కావాల్సిన పొటాషియం అందాలంటే అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరు శెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీర వంటివి తీసుకోవాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించాలంటే ముఖ్యంగా రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, గింజలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.