శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (20:18 IST)

జీర్ణానికి చిన్న చిట్కాలు.. ఇంటి నుంచే

జీవనశైలి పుణ్యమా అని ప్రస్తుత కాలంలో అనేకమంది నోటి వెంట అజీర్ణం, ఎసిడిటీ అన్న మాటలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. వీటి వల్ల గుండెల్లో మంట కూడా ఉంటుంది. అయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. 
 
అయితే తినే ఆహారం.. సమయానికి తింటున్నామా లేదా అనేవే ఇందుకు ప్రధాన కారణాలంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను కనుక మనం చక్కగా ఉంచుకోవాలి అంటే కొన్ని చర్యలను తప్పనసరిగా తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో అల్లం తురుము వేసి బాగా కాచి వడకట్టుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేయాలట.
 
అలాగే ఒక గ్లాసు నీటిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకుని తాగినా తక్షణం ఉపశమనంగా ఉంటుందట. అంతేకాకుండా గ్లాసు నీటిలో సోంపుగింజలు వేసి మరిగించి నీటిని వేడిగా తాగితే ఫలితం ఉంటుందట. కొంచెం వాము తీసుకుని అందులో ఉప్పు కలుపుకుని బాగా నమిలి తిన్నా ఫలితం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.