బస్సు ఎక్కితే వాంతులు... రాకుండా చేయడమెలా?

శనివారం, 17 జూన్ 2017 (13:55 IST)

చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాని ఫలితంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదంటున్నారు వైద్యులు. 
 
చిన్న అల్లం ముక్కను బుగ్గ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అల్లంలో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వక్కపొడిని చప్పరించినా వాంతుల నుంచి బయట పడవచ్చు. 
 
నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా వుంటాయి. వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు, బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పనులతో చిరాగ్గా ఉన్నారా? కాసేపు నడవండి.. రోజుకు 20 నిమిషాలు.. వారానికి ఐదు రోజులు..

పనులతో అలసిపోయి చిరాగ్గా ఉన్నారా.. ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉండిపోవడం, పడుకోవడం దీనికి ...

news

సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుందా? రక్తపోటు తగ్గుతుందా?

ప్రయాణ సాధనాలు అన్నింటిలోకి అద్భుతమైనది సైకిల్. ఖర్చు తక్కువ మరియు మంచి ఎక్స్‌ర్‌సైజ్‌గా ...

news

తొలిరాత్రి వధువు చేతికి పాల గ్లాసు ఎందుకిస్తారు?

నవదంపతుల తొలి రాత్రిన వధువు చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపుతారు. ఇలా ఎందుకు ...

news

బరువు తగ్గాలనుకుంటే.. లవంగం, దాల్చినచెక్క పొడితో.. తేనెను కలుపుకుని?

లవంగాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలాగే తేనెలోనూ ఆరోగ్యానికి ఎంతో ...