శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (18:16 IST)

పులుపు ఎక్కువ తింటే ఏమిటి? తక్కువ తింటే ఏమిటి?

పులుపు అంటే అయిష్టత చూపిస్తారు చాలామంది. కొందరికైతే తలుచుకుంటేనే నోరూరుతుంది. ఏదిఏమైనా శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది కాబట్టి పులుపు కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు ఏమిటో చూద్దాం. చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారిం

పులుపు అంటే అయిష్టత చూపిస్తారు చాలామంది. కొందరికైతే తలుచుకుంటేనే నోరూరుతుంది. ఏదిఏమైనా శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది కాబట్టి పులుపు కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు ఏమిటో చూద్దాం. చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్. 
 
శరీరంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? 
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది.
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది.
* మల విసర్జన బాగా జరగుతుంది.
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటకు పంపుతుంది.
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది.
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు. 
 
అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరాన్ని శిథిలపరుస్తుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణపరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరుపడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి. 
 
కాబట్టి పులుపు తినాలి కానీ మోతాదుకి మించి తినకూడదు... అదీ సంగతి.