మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (22:53 IST)

అబ్బో ఇంట్లోకి గబ్బిలాలు వస్తున్నాయి, వదిలించుకోవాలంటే (video)

గబ్బిలాలను వదిలించుకోవడానికి కొన్ని ముఖ్యమైన నూనెలు ఉన్నాయి. గబ్బిలాలు వాటి స్థలాలను వదిలి పారిపోవాలంటే పిప్పరమెంటు నూనె చల్లి చూడండి. ఆ పిప్పరమెంటు నూనె దెబ్బకి గబ్బిలం ఆ చోటు వదిలి వెళ్లిపోతుంది. ఈ నూనె డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో దొరుకుతుంది.

 
అలాగే దాల్చినచెక్క గబ్బిలాలు నిలబడలేనటువంటి బలమైన సువాసనను కలిగి ఉంటుంది. కనుక గబ్బిలాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో గమనించి ఆ మార్గంలో ఉంచితే అవి వచ్చిన దారినే వెళ్లిపోతాయి. అలాగే పిప్పరమెంటు ఆకు చూర్ణం వాసనకు కూడా గబ్బిలాలు రావు.

 
గబ్బిలాలు ఫినాయిల్ వాసనంటే భరించలేవు. కనుక తెల్లటి ఫినాయిల్‌ను స్ప్రే బాటిల్‌లో పోసి, గబ్బిలాలు ఎక్కడెక్కడ తిష్ట వేసినట్లు అనిపిస్తుందో అక్కడ చల్లాలి. గబ్బిలాలను దూరంగా ఉంచడానికి ఈ స్ప్రే ఎంతో ఉపయోగపడుతుంది.