బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 4 ఆగస్టు 2017 (21:26 IST)

ఆరోగ్యం కోసం తులసి ఆకులను ఆ సమస్య వున్నవారు నమిలితే...

తులసి దళాలు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయో మనందరికి తెలుసు. అశ్వం శాంటమ్ అనే పేరున్న తులసీదళాలలో రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉండేటట్లు చేస్తాయి. తులసీలోని ఈ గుణమే పరిశోధకులను ఆకర్షించే చేసింది. తులసీ దళాలు వేసిన నీటిని తాగితే రక్తంలో అడ్

తులసి దళాలు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయో మనందరికి తెలుసు. అశ్వం శాంటమ్ అనే పేరున్న తులసీదళాలలో రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉండేటట్లు చేస్తాయి. తులసీలోని ఈ గుణమే పరిశోధకులను ఆకర్షించే చేసింది. తులసీ దళాలు వేసిన నీటిని తాగితే రక్తంలో అడ్డంకులు ఏర్పడవు. ఫలితంగా గుండె, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూడడం వల్ల గుండెపోటు నివారితమవుతుంది. 
 
అలాగే మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకపోవడం వల్ల పక్షపాతం లాంటి జబ్బులను కూడా నివారిస్తుంది. అయితే తులసీ దళాలకు ఉన్న రక్తాన్ని పలుచబరిచే గుణమే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న కండిషన్లో ఉన్నవారు తులసీ ఆకులు మనకు మేలు చేస్తాయన్న భావనలో లేదా భక్తితోనో మిగతా ఆరోగ్యవంతుల్లాగే వాడటం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఏదైనా ఆపరేషన్ చేయించుకునే వారు ముందుగా తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగడం అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తస్రావం సమయంలో ఆగకుండా నిరంతంరం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. తులసీ ఆకులను ఆరోగ్యం కోసం వాడే వారు అప్పుడప్పుడు ఒకటి రెండు ఆకులను మాత్రమే వాడాలట. లేకుంటే తులసీ ఆకులే ప్రాణాంతకమవుతుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.