శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 10 జులై 2018 (22:07 IST)

దంతాలను తాజాగా వుంచే పండ్లు, పదార్థాలు

దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ప్రెష్‌నర్లనే వాడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు, పదార్దాలతోనూ వాటిని సాదించవచ్చు. అందుకోసం మనకు ఉపయోగపడేవేంటో చూద్దాం.

దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ప్రెష్‌నర్లనే వాడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు, పదార్దాలతోనూ వాటిని సాదించవచ్చు. అందుకోసం మనకు ఉపయోగపడేవేంటో చూద్దాం.
 
1. స్ట్రాబెరీ, అనాస పండ్లల్లో బ్రొమిలీన్, విటమిన్ సి పోషకాలు అధింకగా ఉంటాయి. ఈ పండ్లని ఎప్పుడు తిన్నా నోరు తాజాగా మారుతుంది.
 
2. యాపిల్ లోని పోలిక్ యాసిడ్ పళ్లని శుభ్రం చేస్తుంది. సాయంత్రం పూట ఆకలి వేసినప్పుడు బిస్కెట్లు తినే బదులు ఒక యాపిల్‌ని తినేయండి. దీనివల్ల నోరు తాజాగా ఉంటుంది.
 
3. చీజ్, పనీర్‌లోని క్యాల్షియం ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. అందువల్ల వీటిని తీసుకోవడం కారణంగా నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు.
 
4. బాదంలో దంతాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి.ఇవి పళ్లకి ఎంతో మేలు చేస్తాయి.
 
5. మనం ఏ ఆహారం తీసుకున్నా నీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే నీరు నోటిలోని యాసిడ్ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది.
 
6. పెరుగులోని మంచి చేసే బ్యాక్టీరియాలు నోటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. దీనిలో బాదం పలుకులు, స్ట్రాబెరి కలుపుకుంటే పళ్లు తాజాగా ఉంటాయి.