శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 మే 2020 (20:21 IST)

మామిడి కాయలు ఎక్కువగా తింటే ఏమవుతుంది?

మామిడి సీజన్ వచ్చేసింది. కాకపోతే కరోనా వైరస్ కారణంగా ఈ మామిడి కాయలను తినాలన్నా భయపడుతున్నారు. ఐతే కొన్ని జాగ్రత్తలతో పాటు మామిడి కాయ పైన వున్న తొక్కను తీసేసి తింటే సరిపోతుంది. ఈ మామిడి కాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం. 
 
1. మామిడి కాయలో పీచు పదార్ధం అధికంగా ఉన్నందున విరోచనం సాఫీగా అవుతుంది. ఐతే ఎక్కువగా తింటే ఉడుకు విరోచనాలు పట్టుకుంటాయి కనుక అతిగా తీసుకోరాదు. 
 
2. విటమిన్ ఎ, సి, ఇ, ఫైటో కెమికల్స్, పాలిఫినాల్స్, అమినా యాసిడ్లు ఇందులో పుష్కలంగా వుంటాయి.
 
3. రక్తపోటు బాధితులకు అవసరమై పొటాసియం లభిస్తుంది.
 
4. మామిడి పండు రసం వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
 
5. పాలతో కలిపి తీసుకుంటే బలాన్నిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.