భోజనం చేసే సమయంలో బిస్కెట్లు తింటున్నారా?

శనివారం, 13 మే 2017 (13:34 IST)

భోజనం చేసే సమయంలో బిస్కెట్లు తింటున్నారా? సమోసాలు లాగిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. భోజనం కాకుండా ఇతర పదార్థాలు లంచ్ టైమ్‌లో తీసుకుంటే.. టైప్ టు డయాబెటిస్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ప్రతిరోజూ క్రమం తప్పకుండా సమయానికి ఆహారం తీసుకోకపోతే డయాబెటిస్ తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. భోజనం చేయకుండా ఉండే వారిలో, వేళాపాళా లేకుండా భోజనం చేసే వారిలోనూ మెటబాలిక్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
పని ఒత్తిడితో వేళాపాళా లేకుండా భోజనం చేస్తే ఒబిసిటీ కూడా తప్పదు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమంతప్పకుండా ఒకే వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగని రోజంతా తింటూ ఉండకూడదు. ముప్ఫై ఏళ్ళ లోపు వారైతే, రోజుకు మూడు పూటలా తినడం మీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. అదే మీకు ముప్ఫై పైబడి ఉంటే, ఆహారాన్ని రోజుకు రెండు పూటలకే తగ్గించడం ఉత్తమం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మన శరీరం, మనుసు అత్యుత్తమంగా పనిచేస్తాయి. అందుకే సగం కడుపు ఖాళీగా ఉండేట్లు ఆహారం తీసుకుని.. ఆకలేస్తే పండ్లు, సలాడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

శాఖాహారుల్లోనే ఆ సామర్థ్యం ఎక్కువట

శాఖాహారులు లైంగిక సామర్థ్యంలో మహా దిట్ట అంటున్నారు పరిశోధకులు, ఎందుకంటే మాంసాహారం ...

news

గ్రీన్ టీ ఆకులతో అందం... స్త్రీలకే కాదు పురుషులకు కూడా...

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఆరోగ్యానికే కాదు ...

news

ఇలా చేస్తే జుత్తు రాలిపోదు కదా బట్టతలకి దూరంగా ఉండొచ్చు...

చాలా మందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. కొందరికి వాడే నీరు పడక జట్టు రాలిపోతుంది. ...

news

క్లియోపాత్రనే మెప్పించిన కలబంద.. ఆరు వేల సంవత్సరాలుగా మనిషికి ఉత్తమ సేవ

గ్రామాల్లో పొలాల గట్లపై, వాగుల్లో, బంజరభూముల్లో కలబంద విస్తారంగా పెరుగుతోంది. తొలుత ఈ ...