Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టిఫిన్ చేసిన వెంటనే కాఫీ, టీలు తాగడం చేస్తే?

శనివారం, 1 జులై 2017 (15:18 IST)

Widgets Magazine
coffee

టిఫిన్ లేదా భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటున్నవారు మానుకోవాల్సిందే అంటున్నారు.. వైద్యులు. టిఫిన్ ముగించిన వెంటనే ఓ కప్పు కాఫీ లేదా టీ తాగడం.. అదే అలవాటును మధ్యాహ్నం, రాత్రి పూట కొనసాగించడం ద్వారా జీర్ణ వ్యవస్థ మందగిస్తుందని, జీర్ణక్రియకు ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో సగానికి సగం నీరు, సగానికి సగం ఆహారం ఉండేలా చూసుకుంటేనే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 
 
అలాకాకుండా వేడి వేడి టీ, కాఫీలు తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పాలు, కాఫీ తాగిన వెంటనే టిఫెన్‌ చేయకూడదు. అలాగే టిఫెన్‌ చేసిన వెంటనే వాటిని తాగకూడదు. ఆహారానికి ముందు వెనకా గంట బ్రేక్ ఇచ్చాకే టీ, కాఫీలు తాగాలి. అలాకాకుంటే.. గ్యాస్, అసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపుతుంది. గుండెకు కూడా ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే ఉదయాన్నే టిఫిన్‌‌‌ చేసిన తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్‌, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లాలి. లంచ్‌ తీసుకొనేలోపు వీటిని తినడం ద్వారా కేలరీలతు తగినట్లు శక్తి పొందగలుగుతారు. నిద్రలేవగానే ఒక్కోసారి బయటికి వెళ్లాల్సివస్తే వెంటనే టిఫిన్‌ చేయకుండా ప్రయాణంలో తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రతిరోజూ ఒకే సమయానికి అల్పాహారం చేసే ప్రయత్నం చేయండి. దీని వలన మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా, క్రమబద్ధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి

పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ ...

news

కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? జాగ్రత్తలేమిటి?

కిడ్నీలో రాళ్లకు కారణం కొన్ని ఆహార పదార్థాలే. పాలు, పాలకూర, సోయాబీన్స్, చాక్లెట్లు వంటివి ...

news

రోజుకు ఓ కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే...?

దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ...

news

భార్యాభర్తలు శారీరక సుఖానికి దూరమైతే...

భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక ...

Widgets Magazine