శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 25 మార్చి 2020 (23:09 IST)

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఏం చేయాలి?

ప్రతి రోజూ ఒకటి లేద రెండు ఖర్జూరం పండ్లు తింటే శరీరంలో అనవసరంగా చేరు కొవ్వు తగ్గుతుంది. శరీరానికి కావలసిన చురుకుదనం అధికంగా ఈ ఖర్జూర పండ్ల నుంచి పొందవచ్చును.
 
రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండం వల్ల గుండె పదిలంగా వుంటుంది. శరీరమునకు ఏ రకమైన వ్యాధి రాకుంటా ఉండేందుకు ఈ పండ్లు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
 
డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు.
 
ప్రోటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు.
 
మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.
 
నవ్వు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వ్యాధి నుంచి కాపాడే ప్రొటీనులు, గామ్మా- ఇంటర్ ఫెరాన్, వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది.
 
దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.