రాత్రి పడుకునే ముందు ఆ ఆకు సేవిస్తే అద్భుత ఫలితం...

గురువారం, 22 ఫిబ్రవరి 2018 (17:46 IST)

leafs

సునాముఖి ఆకు ప్రయోజనాలు అనేకం. ఏ పదార్ధంతో కలిపి తీసుకుంటుంన్నాం అనే దాని మీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అదెలా అంటే, ఒక స్పూన్ సునాముఖి ఆకు చూర్ణాన్ని, అరకప్పు వేడి ఆవుపాలతో కలిపి సేవిస్తే రక్త శుద్ధి కలుగుతుంది. శరీరం కూడా కాంతిమంతమవుతుంది. 
 
నేతితో సేవిస్తే శరీరంలోని అనేక రుగ్మతలు పోతాయి. పంచదారతో సేవిస్తే వాతం తగ్గుతుంది. తేనెతో సేవిస్తే ధాతుపుష్టి కలుగుతుంది. మేక పాలతో తీసుకుంటే శరీరం బలిష్టమవుతుంది. పాత బెల్లంతో తీసుకుంటే జలుబు తగ్గుతుంది. గుంటగలగరాకు రసంతో అయితే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్షపండు రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది.
 
1. 3 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా పటికబెల్లం కలిపి రోజుకి రెండుపూటలా సేవిస్తే శరీర పుష్టి కలుగుతుంది.
 
2. 10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లతో సేవిస్తే, సుఖ విరేచనం కలుగుతుంది.
 
3. రెండున్నర గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు వాడితే కండ్ల జబ్బులు నయమవుతాయి.
 
4. 5 గ్రాముల ఆకు చూర్ణానికి 10 గ్రాముల దోసగింజల చూర్ణం కలిపి సేవిస్తే మూత్రద్వారానికి అడ్డుపడే రాళ్లు కరిగిపోతాయి.
 
5. 10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తింటూ వుంటే అన్ని రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సొరకాయ ముదురు గింజలను వేయించి ఉప్పు, ధనియాలు కలిపి....

శరీరంలోని జీవక్రియలన్నీ సవ్యంగా పని చేసినప్పుడే లైంగిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సొరకాయలో ...

news

దంతాలు తెల్లబడటం కోసం వాటిని వాడేస్తున్నారా?

దంతాలు తెల్లగా మారుతాయని.. టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్‌లు విపరీతంగా వాడటం మంచిది ...

news

అరటిపండును రాత్రిపూట తినకూడదట?

పొటాషియం పుష్కలంగా వుండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర రోగ నిరోధక ...

news

శృంగారంలో విఫలం... ఏదేదో తినేబదులు ఇవి తింటే చాలు...

ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి, మనసుకి అస్సలు విశ్రాంతి ఉండడంలేదు. ...