1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By chitra
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:09 IST)

నూతన వధూవరుల తలపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఎందుకు ఉంచుతారు?

మన తెలుగు పెళ్లిళ్లలో జీలకర్ర, బెల్లం పెట్టడం ఒక సంప్రదాయం. వధూవరులు ముహూర్త కాలంలో ఒకరి నొకరు చూసుకోవడానికి నీరిషనామ్ అంటారు. కళ్యాణ వేదికపై వధువు తూర్పు ముఖంగా, వరుడు పశ్చిమముఖంగా కూర్చుంటారు. మంగళ

మన తెలుగు పెళ్లిళ్లలో జీలకర్ర, బెల్లం పెట్టడం ఒక సంప్రదాయం. వధూవరులు ముహూర్త కాలంలో ఒకరి నొకరు చూసుకోవడానికి నీరిషనామ్ అంటారు. కళ్యాణ వేదికపై వధువు తూర్పు ముఖంగా, వరుడు పశ్చిమముఖంగా కూర్చుంటారు. మంగళ వాద్యాల మధ్య తెర తొలగడంతోనే వధువు కనుబొమ్మల మధ్య చూస్తాడు వరుడు. వివాహంలో సరిగ్గా ముహూర్తం వేళకు పురోహితుడు జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరులిద్దరూ ఒకరి తలమీద ఒకరు ఉంచేలా చేస్తారు. 
 
శాస్త్రరీత్యా ఈ ''గుడజీరక'' మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అలా జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్దని తలలమీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధూవరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి, జీవితాంతం అన్యోన్యంగా కలసిమెలసి ఉంటారన్నది దీని ఆచారం. జీలకర్ర, బెల్లం వలన ఏర్పడి రసాయనక చర్య వల్ల మానసిక బంధం బలపడుతుందని మన పూర్వీకుల అభిప్రాయంగా ఉంది.