పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో జరిగినవి ఏమిటి?

సోమవారం, 19 జూన్ 2017 (16:49 IST)

potuluri veerabrahmam

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానానుసారమే సమాజంలో అనేక వింతలు విశేషాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన విషయాలను ఓసారి పరికిస్తే పోతులూరి కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగానే జరగడం గమనార్హం. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
భారతదేశాన్ని ఓ అంబ 16 యేళ్ల పాటు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ దశాబ్దన్నర కాలానికిపైగా దేశ ప్రధానిగా ఉన్నారు). 
తెరమీద కదిలే బొమ్మలు గద్దెనెక్కుతాయి. ప్రజలను పాలిస్తారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (పలువురు సినీ నటులు పలు రాష్ట్రాలను పాలించారు). 
దేశంలో రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. (ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా రాజుల పాలన లేదు). 
ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు. (ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు). 
సమాజంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. (ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది).
బ్రాహ్మణ అగ్రహారాలు అంతరించిపోతాయి. (ఇపుడు దేశంలో బ్రాహ్మణ అగ్రహాలు ఎక్కడా కనిపించవు). 
హైదరాబాద్‌ నగరంలో తురకలు, హిందువులు ఒకర్నొకరు నరుక్కుని చచ్చిపోతారు. (హైదరాబాద్ నగరం మతకలహాలకు పెట్టింది పేరు). 
ఆలయాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దేశంలో అనేక ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురవుతున్నాయి). 
చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. (అన్ని రకాల యంత్రాలూ వచ్చినా.. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేకపోయారు). ఇలాంటివి ఎన్నో జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. దీనిపై మరింత చదవండి :  
Potuluri Veera Brahmendra Swamy Kalagnanam

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కర్ణుడు పూర్వజన్మలో రాక్షసుడా?

కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు. నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం ...

news

ఇంటికి ఎలాంటి కోడలిని ఎంపిక చేసుకోవాలని శాస్త్రం చెపుతోంది?

పూర్వకాలంలో మంచి గుణగణాలున్న అమ్మాయి కోసం గాలించే క్రమంలో ఏడు జతల చెప్పులు అరిగిపోయేలా ...

news

అభిమన్యుడిని కౌరవులు చంపలేదట... ఎవరు చంపారు?

మహాభారత యుద్ధంలో అర్జునుడి పుత్రుడు అభిమన్యుడి వీరోచిత పాత్ర గురించి ప్రత్యేకంగా ...

news

శివుడు శ్మశానంలో కొలువైవుండటానికి కారణమేంటి?

శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ...