1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 15 జులై 2015 (06:53 IST)

రెండో రోజు ఆరంభమైన పుష్కర స్నానాలు.. హెలికాఫ్టర్ ద్వారా పర్యవేక్షణ

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది భక్తులు రెండు రాష్ట్రాలలో స్నానఘట్టాలకు చేరుకున్నారు. ఉదయమే బారులు తీరారు. ప్రభుత్వాలు కూడా ఒక్క సారిగా అప్రమత్తమయ్యాయి. మంగళవారం నాటికి తొక్కిసలాట ఘటనతో మరింత భద్రతా ఏర్పాట్లు తెలుగు రాష్ట్రాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి హెలికాఫ్టర్ల ద్వారా పుష్కర స్నానాలను పర్యవేక్షిస్తోంది. 
 
ఖమ్మం జిల్లా భద్రాచలం, ఆదిలాబాద్‌ జిల్లా బాసరల ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి , సరస్వతీ ఘాట్‌ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు.