1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (18:45 IST)

కార్తీక సోమ, ప్రదోష వేళల్లో శివుడిని పూజిస్తే?

కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో శివయ్యను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. కార్తీక మాసాల్లో వచ్చే ప్రదోష వేళల్లో శివుడిని పూజించడం ద్వారా సమస్త పాపాలు హరింపబడతాయి. శివుడు ప్రదోష సమయం (సాయంత్రం సమయంలో) ఆనంద తాండవం చేస్తూ వుంటాడని, ఆ సమయంలో సమస్త దేవతలు అక్కడికి చేరుకుంటారని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రదోష వేళలో శివునిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుందని వారు సూచిస్తున్నారు. 
 
అందుచేత కార్తీక సోమవారాలు, ప్రదోష రోజుల్లో ఉపవాస దీక్షను చేపట్టి .. ప్రదోష వేళలో శివుడిని ఆరాధించి పూజలు చేయాలి. ఇంకా ఆ రోజుల్లో శివాలయానికి వెళ్లి అక్కడ దీపాన్ని వెలిగించాలి. సోమ, ప్రదోష సమయాల్లో శివుడిని పూజించడం ద్వారా.. ఆయన ఆలయంలో దీపాలను వెలిగించడం ద్వారా సమస్త పాపాలు, దోషాలు నశించి.. అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.