1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (10:41 IST)

క్యూలైన్లు తనిఖీ చేసిన టీటీడీ ఈవో

వైకుంఠ ఏకాదశి దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు శనివారం సాయంత్రం తిరుమలలోని క్యూ కాంప్లెక్సులను తనిఖీ చేశారు. ఏటీజీహెచ్, వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి పుట్ పాత మార్గాలను ఆయన పరిశీలించారు. 
 
రెండు పర్వదినాలు ఒకే రోజు జనవరి 1, 2015 వస్తున్న కారణంగా తాము అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఈవో చెప్పారు. రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే తాము ఏర్పాట్లను తగు విధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు. కనీసం 40 వేల మంది కంపార్టుమెంట్లలో కూర్చునే సౌకర్యాలను పరిశీస్తున్నామని చెప్పారు. 
 
ఏటిజీహెచ్ నుంచి ఆలయం లోపలి వరకూ కనీసం 2.7 కిలోమీటర్లు దూరం ఉంటుందని ఈ ప్రాంతంలో సింగిల్ లైను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ ఈ రమేష్ రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.