గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (14:03 IST)

ఆచారమే తపస్సు..?

ఆచారం అంటే తెలియని వారుండరు. ఆచారం అనే పద్ధతి ఇక ఏ విషయంలోనూ, పద్ధతిలోనూ ఉండదు. ఆచారం అంటే.. సంప్రదాయమని చెప్తుంటారు పెద్దలు. పెద్దల మాట ప్రకారం వస్తే.. నేటి తరుణంలో ఆచారం అనే మాట లేకుండా పోతుంది. అందుకు కారణం... దాని పరమార్థాన్ని తెలుసుకోకుండా ఉండడమేనంటున్నారు పండితులు. మరి ఆచారం అంటే ఏంటో ఓసారి తెలుసుకుందాం..
 
ఆచారం ప్రథమ ధర్మం. అది వేదోక్తమైతే మరీ శ్రేష్ఠం. ఆచారం వలన ఆయువు, సత్సంతతి, అక్షయ్యమైన అన్నం ప్రాప్తిస్తాయి. ఆచారం పరమ ధర్మం. కళ్యాణకారకం. ఆచారం వలన ఇహపరసౌఖ్యం లభిస్తుంది. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టుడే మోహితాత్ములకు ధర్మం దీపతుల్యం, ముక్తి మార్గ ప్రదర్శకం. ఆచారం వలన కర్మాచరణమూ, దాని వలన జ్ఞానప్రాప్తి కలుగుతుంది.
 
అన్నీ ధర్మాలకంటే ఆచారం శ్రేష్ఠం. అదే తపస్సు. అదే జ్ఞానం. దానివలన సర్వం సిద్ధిస్తుంది. శాస్త్రీయమని, లౌకికమని ఆచారం రెండు విధాలున్నాయి. ఆ రెండూ అనుషింపదగ్గవే. వానిని విడువరాదు. గ్రామ ధర్మాలను, జాతి ధర్మాలను, కుల ధర్మాలను విధిగా పాటించాలి. వాటిని ఉల్లంఘించరాదు. ధర్మ విపర్జితమైన అర్ధకామాలు అనర్ధదాయకాలు. సదాచార సంపన్నునకే చతుర్విధ పురుషార్థ సంసిద్ధి.