మంగళవారం, 28 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:27 IST)

నిద్రలేవగానే తల్లిదండ్రులను చూస్తే..?

పూర్వం నిద్రలేవగానే ఆవును లేదా అద్దాన్నీ గానీ తల్లిదండ్రులు, భార్యను చూడటం ఆచారంగా కనిపిస్తుంది. అద్దం లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూడడం వలన లక్ష్మీదేవి మోమును చూసినట్టు అవుతుంది.
 
ఇక ఆవు సకలదేవతా స్వరూపమని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక, ఆవును చూడడం వలన సమస్త దేవతలను దర్శించినట్టు అవుతుంది. ఇక అర్థాంగి ఎప్పుడూ కూడా తన భర్త శ్రేయస్సునే కోరుకుంటుంది. ఆయన కోసమే వ్రతాలు, నోములు చేస్తూ ఉంటుంది. అందువలన ఇంటికి దీపం లాంటి ఇల్లాలి ముఖాన్ని చూడటం వలన అంతా మంచే జరుగుతుందని అంటారు.
 
ఇక తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు. కాబట్టి.. ఉదయాన్నే వారిని చూడడం వలన లక్ష్మీనారాయణులను ... శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.