శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 మార్చి 2022 (22:32 IST)

హోలిక దహన్- చోటీ హోలీ, ఈ పండుగ విశిష్టత ఏమిటి?

హోలీ... జీవితంలో సుఖదుఃఖాల వలనే రంగులతో మిళితమైనది ఈ పండుగ. హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత ఉత్సబ్ పండుగ అని అంటారు. హోలీ పండుగను భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.

 
హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ లేదా చోటీ హోలీ అని అంటారు.

 
హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటారు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

 
ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత ఫాల్గుణ బహుళ పంచమిన పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగపంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున.. తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి. అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.