కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య-ఆరాధ్య.. ఆరాధ్య పెదవులపై ముద్దు.. నెటిజన్లు?

మొన్నటికి మొన్న కేన్స్ ఉత్సవంలో మెరిసిన మాజీ మిస్ వరల్డ్, ప్రముఖ బాలీవుడ్ నటి, బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె ఆరాధ్య ఎరుపు గౌన్‌లో తల్లితో పాట

selvi| Last Updated: శుక్రవారం, 18 మే 2018 (13:10 IST)
మొన్నటికి మొన్న కేన్స్ ఉత్సవంలో మెరిసిన మాజీ మిస్ వరల్డ్, ప్రముఖ బాలీవుడ్ నటి, బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె ఎరుపు గౌన్‌లో తల్లితో పాటు మెరిసింది. ఈ సందర్భంగా ఐష్ ఆరాధ్యను తిప్పుతూ కేన్స్‌కు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెమలి పింఛాన్ని పోలిన గౌన్‌లో ఐష్ అదుర్స్ అనిపించింది. 
 
తాజాగాతన కుమార్తె ఆరాధ్య పెదవులను ముద్దాడిన ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్య పెదవులపై ముద్దాడిన ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. ఓ తల్లి తన మాతృ ప్రేమను వ్యక్తం చేయడానికి పెదవులపై ముద్దాడాలా? ఇది తల్లికి సరైనది కాదంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే కుమార్తెను ముద్దాడేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓ తల్లి తన కూతుర్ని ముద్దాడినా వివాదం చేస్తారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. తల్లి ప్రేమను కూడా నెటిజన్లు వివాదం రేపడం అసంబద్ధమని దియామీర్జా తెలిపింది.

This is so beautifulదీనిపై మరింత చదవండి :