శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By PNR
Last Updated : ఆదివారం, 7 సెప్టెంబరు 2014 (14:07 IST)

"ఐ" చిత్ర ఆడియోకు విచ్చేస్తున్నా : ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్

సెన్సేనల్ డైరక్టర్ శంకర్, సియాన్ విక్రం కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఐ. తెలుగులో మనహరుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 15వ తేదీన జరుగనుంది. ఈ ఆడియో వేడుకలకు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు సోని మ్యూజిక్ ఇండియా సంస్థ ఓ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది.
 
ఆ వీడియోలో ష్వార్జ్ నెగ్గర్ మాట్లాడుతూ, "హలో ఇండియా... 'ఐ' సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయి. ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. ఈ సినిమా ఆడియో వేడుక సెప్టెంబర్ 15న జరగనుంది. అందులో పాల్గొనేందుకు చెన్నై వస్తున్నా" అని పేర్కొన్నారు. 
 
కాగా, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. విక్రమ్ సరసన అమీజాక్సన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది.