శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pnr
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2015 (14:44 IST)

పూటుగా మద్యం సేవించి సెక్స్ సన్నివేశంలో నటించా : జెన్నీఫర్‌ లారెన్స్‌

సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో న్యూడ్‌ సీన్లు, సెక్స్ సన్నివేశాలు సర్వసాధారణం. హాలీవుడ్ నటీనటులు కూడా ఈ తరహా సన్నివేశాల్లో పెద్దగా ఇబ్బందులు పడకుండా నటిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. నాటి మార్లిన్‌ మన్రో దగ్గర్నుంచి నేటి ఎంజెలినా జోలీ వరకు ఇలాంటి సీన్లలో నటించే స్టార్‌లుగా ఎదిగారు. కానీ, జెన్నీఫర్‌ లారెన్స్‌ మాత్రం ఈ తరహా సీన్లకు కాస్తంతా దూరంగా ఉంటున్నారు. 
 
శృతిమించిన సెక్స్ సన్నివేశాల్లో ఆమె ఇప్పటివరకు పెద్దగా నటించలేదు. అయితే, ఇటీవలే ఈ తరహా సందర్భం ఈ భామకు ఎదురైంది. ప్రస్తుతం లారెన్స్‌ 'పాసింజర్స్‌' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఓ సెక్స్‌ సీన్‌ ఉంది. హీరో క్రిస్‌ ప్రాట్‌తో కలిసి ఆ సన్నివేశంలో లారెన్స్‌ నటించాల్సి ఉంది. క్రిస్‌ ప్రాట్‌ ఇదివరకే అలాంటి సీన్లు ఎన్నో చేశాడు. పైగా వివాహితుడు. దీంతో లారెన్స్‌కు వణుకు మొదలైంది. కెమెరా ముందు తొణకకుండా నటించడానికి ఒక బార్‌కు వెళ్లి బాగా వైన్‌ తాగిందట. అనంతరం ఆ సీన్‌ను బాగానే రక్తికట్టించిందట. 
 
దీనిపై ఈ నటి స్పందిస్తూ 'తెరపై నా మొదటి సెక్స్‌ సీన్‌ షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. అది నిజంగా చాలా ఎంగ్జైటీగా అనిపించింది. అంతా బాగానే వచ్చింది. అతను పెళ్లైన వాడు. ఆ సీన్‌లో నటించాలంటే ముందు నాకు భయమేసింది. అందుకే ఆ సీన్‌కు ముందు నేను బాగా తాగాను. సీన్‌ పూర్తయి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాన'ని జెన్నీఫర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.