శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (08:59 IST)

మడోన్నా లైవ్ నేషన్: ఇప్పటికీ తగ్గని క్రేజ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుబోయిన..

అమెరికన్ పాప్ గాయని మడోన్నా నుంచి ఈ మధ్య పెద్దగా హిట్స్ వచ్చింది లేదు. అయినాగానీ, అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 56 ఏళ్ల వయసులోనూ సెక్సప్పీల్ కనబరుస్తున్న ఈ అందాల సుందరి కచేరీలకు ఇంకా విపరీతమైన డిమాండ్ నెలకొని ఉంది. అమ్మడు డిసెంబర్ 9న ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్‌లో కచేరీ ఇవ్వనుంది. అందుకు సంబంధించి 15 వేల టికెట్లను అమ్మకానికి పెడితే 5 నిమిషాల్లో అయిపోయాయట. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 'లైవ్ నేషన్' తెలిపిందీ వివరాలు. 
 
మడోన్నా ఆగస్టు 29 నుంచి వరల్డ్ టూర్ షురూ చేయనుంది. తన లేటెస్ట్ ఆల్బం 'రెబెల్ హార్ట్' ను ఈ సందర్భంగా ప్రమోట్ చేసుకోనుంది. కాగా మడోన్నా ఐదు పదుల వయస్సు మీద పడినా ఆమె సాంగ్స్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని.. ఆమె ఫ్యాన్స్ ఆమె సాంగ్స్ అంటే పడి చస్తున్నారని హాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.