గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (13:45 IST)

కుమారుడితో నటి మడోన్నాకు తంటాలు.. ఆమెకు దూరంగా ఉండటంలో అతడికి సంతోషమట..

ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్, హాలీవుడ్ శృంగార నటి మడోన్నాకు ఆమె కుమారుడు రొక్కో రిట్చీతో తలనొప్పి తప్పట్లేదు. గడిచిన వారంలో డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడిన రిట్చీ.. తన తల్లికి దూరంగా ఉంటున్నాడు. తండ్రిత

ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్, హాలీవుడ్ శృంగార నటి మడోన్నాకు ఆమె కుమారుడు రొక్కో రిట్చీతో తలనొప్పి తప్పట్లేదు. గడిచిన వారంలో డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడిన రిట్చీ.. తన తల్లికి దూరంగా ఉంటున్నాడు. తండ్రితో కలిసి వుంటున్న రిట్చీ.. తల్లిపై విమర్శలు గుప్పించాడు. తాజాగా తన తల్లి మడొన్నాను కించపరిచే విధంగా ఇన్ స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను ఉంచాడు.
 
మడోన్నా ఏదో తింటున్న సమయంలో, సగం ఆహార పదార్థం నోటి నుంచి బయటకు వచ్చి, అసహ్యంగా ఉంది ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేగాకుండా 'ఆమెతో కలసి ఉండటం లేదు... చాలా సంతోషం' అంటూ ఓ వ్యాఖ్యను కూడా ఫొటోకు జత చేశాడు. ఈ వ్యవహారంపై మడోన్నా అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మడోన్నా ఫ్యాన్స్ కామెంట్స్ తట్టుకోలేక రిట్చీ.. ఆ ఫోటోను తొలగించాడు.