శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By మోహన్
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (18:28 IST)

చెన్నై నగరాన్ని ఆ వరుణదేవుడే కాపాడాలి: హాలీవుడ్ హీరో

దక్షిణ భారతదేశంలోని మెట్రోనగరాల్లో ఒకటైన చెన్నై నగరం ప్రస్తుతం తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోతోంది. భూమిలోని జల వనరులు తగ్గిపోవడంతో జనం నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి కేవలం పార్లమెంట్‌లోనే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 
 
ఏకంగా టైటానిక్ సినిమాలో నటించిన హాలీవుడ్ హీరో లియనార్డో డికాప్రియో చెన్నై నీటి సమస్య మీద సమగ్రంగా సమాచారాన్ని సేకరించి చదివి ప్రపంచానికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నీటి కోసం దాదాపు ఎండిన బావుల వద్ద మహిళలు అవస్థలు పడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
అంతేకాకుండా వర్షమే ఆ నగరాన్ని కాపాడాలి, జనం ప్రభుత్వ నీటి ట్యాంకర్ల వద్ద బారులు తీరి తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని, అధికారులు ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం ప్రయత్నిస్తున్నారంటూ పోస్ట్ పెట్టారు.