శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (04:11 IST)

ఆస్కార్‌లో మెరిసిన మన భారతీయ చీరకట్టు

ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డల కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రెడ్ కార్పెట్ ఈవెంట్ నిలుస్తుంటుంది. ఈసారి కూడా అదే పునరావృతమయ్యింది కానీ భారతీయ చీరకట్టు 89వ ఆస్కార్ అవార్డుల్లో మెరిసిపోయింది. భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీ

ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డల కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రెడ్ కార్పెట్ ఈవెంట్ నిలుస్తుంటుంది. ఈసారి కూడా
అదే పునరావృతమయ్యింది కానీ భారతీయ చీరకట్టు 89వ ఆస్కార్ అవార్డుల్లో మెరిసిపోయింది. భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీరకట్టు 89వ ఆస్కార్‌ వేడుకల్లో వీక్షకులతో పాటు సినీ ప్రముఖుల కళ్లను కట్టిపడేసింది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేట్‌ అయిన దేవ్‌ పటేల్‌.. తన తల్లి అనితా పటేల్‌తో కలసి ఆస్కార్‌ వేడుకలకు హాజరయ్యారు.
 
చీరకట్టులో భారతీయ హుందాతనం చూపించిన అనితా పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘‘దేవ్‌ పటేల్‌కి ఆస్కార్‌ రాకున్నా.. 26 ఏళ్లకు నామినేషన్‌ దక్కడం అద్భుతమైన విషయం. ఆ లెక్కన దేవ్‌ విన్నరే. ఇంత త్వరగా దేవ్‌కి ఆస్కార్‌ నామినేషన్‌ వస్తుందని ఊహించలేదు’’ అని అనితా పటేల్‌ పేర్కొన్నారు.