1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (17:59 IST)

సీక్రెట్‌గా బ్రాడ్ ప్రిట్, ఏంజెలీనా జోలీ పెళ్లిచేసుకున్నారోచ్!

ఫ్రాన్స్‌లో సీక్రెట్‌గా బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వివాహం జరిగింది. హాలీవుడ్ స్టార్ జోడీ అయిన జోలీ, బ్రాడ్ పిట్‌లు ఆగస్టు 23వ తేదీన దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ గ్రామంలో ఉన్న కుటుంబ ఎస్టేట్‌లో జోలీ, బ్రాడ్‌లు వివాహం చేసుకున్నట్లు వారి అధికార ప్రతినిధి మీడియాకు తెలియజేశారు. ఈ వేడుకకు కేవలం వారి ఆరుగురు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, ఇంకా ఓ ఇరవై మంది సన్నిహితులే హాజరయ్యారని తెలిపాడు.
 
కాగా, వివాహానికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ 'హల్లో', 'పీపుల్' మ్యాగజైన్‌లు కవర్ పేజ్‌పై తాజాగా ప్రచురించాయి. 2005లో హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' షూటింగ్ సెట్ లో జోలీ, బ్రాడ్ పిట్ ల మధ్య ప్రేమ చిగురించింది. 
 
అప్పటినుంచి సహజీవనం చేస్తున్న వారిద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతకుముందే మరో ముగ్గురిని దత్తత చేసుకున్నారు. తాజాగా ఈ జంట భార్యాభర్తలుగా మారారు. అయితే, గతంలో జోలీకి రెండుసార్లు, పిట్‌కు ఒకసారి వివాహం అయింది.