శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Selvi
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (11:39 IST)

స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో మరో సినిమా: టామ్ హోలాండ్ ఎంపిక

స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో మరో చిత్రం రానుంది. సోనీ పిక్చర్స్, మార్వెల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ పాత్ర కోసం 19 సంవత్సరాల బ్రిటీష్ నటుడు టామ్ హోలాండ్‌ను ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ సినిమాకు జాన్ వాట్స్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా జూలై 29, 2017లో విడుదల కానుంది. 
 
హీరో పాత్రపై సోనీ పిక్చర్స్ ఛైర్మన్ రోత్ మన్ మాట్లాడుతూ.. హీరో రోల్ కోసం ఎందరో యువ నటుల్ని పరిశీలించామన్నారు. టామ్ స్కీన్ ప్రత్యేకంగా కనిపించాడని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. కొత్త స్పైడర్ మ్యాన్ చిత్రం పీటర్ పార్కర్ విద్యాబ్యాసం నేపథ్యంలో సాగుతుందని హాలీవుడ్ వర్గాల టాక్. 
 
కాగా, 2012లో విడుదలైన సునామీ డ్రామా 'ది ఇంపాజిబుల్'లో టామ్ హోలాండ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలో రిలీజ్ కానున్న 'సివిల్ వార్' చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే.