కుమారుడి స్పెర్మ్‌తో బిడ్డకు జన్మనిచ్చిన హాలీవుడ్ నటి
ప్రముఖ హాలీవుడ్ నటి చనిపోయిన తన కుమారుడి స్పెర్మ్‌ను సేకరించి భద్రపరిచి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్త ప్రస్తుతం కలకలం రేపింది.
కొన్నేళ్ల క్రితం మరణించిన స్పానిష్ నటి అనా ఒబ్రెగాన్ కొడుకు.. స్పెర్మ్‌ను సేకరించి భద్రపరిచాడు. ఈ స్థితిలో అద్దె తల్లి ద్వారా కుమారుడి స్పెర్మ్‌తో బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.
చనిపోయిన తన కుమారుడి ఆఖరి కోరికను తీర్చానని, తన కొడుకు చివరి కోరిక తీర్చకపోతే ఎలా అని తెలిపింది. అయితే అనా చర్యను స్పెయిన్ మంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు.