శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By chitra
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (11:17 IST)

మైఖేల్ జాక్సన్ బ్రెయిన్ సర్జరీ చేయించాలనుకున్నాడా? బాల్యంలో నిరాదరణ, హింసకు గురైయ్యాడా?

మైఖేల్ జాక్సన్. ఈ పేరు వింటేనే కోట్లాది మంది అభిమానుల కాళ్లు ఉవ్వెత్తున ఉరకలేస్తాయి. మూడు దశాబ్దాల పాటు ఈ పాప్ స్టార్ ఆడిందే ఆట.. పాడిందే పాట. తన పాటకి డాన్స్‌కి తిరుగే లేదని నిరూపించున్నాడు.

మైఖేల్ జాక్సన్. ఈ పేరు వింటేనే కోట్లాది మంది అభిమానుల కాళ్లు ఉవ్వెత్తున ఉరకలేస్తాయి. మూడు దశాబ్దాల పాటు ఈ పాప్ స్టార్ ఆడిందే ఆట.. పాడిందే పాట. తన పాటకి డాన్స్‌కి తిరుగే లేదని నిరూపించున్నాడు. కింగ్ ఆఫ్ పాప్ మరణించినా కూడా ఆయన మ్యూజిక్ మాత్రం ధ్వనిస్తూనే వుంది. మైఖేల్‌ జాక్సన్ రూపొందించిన ఆల్బమ్స్ ఎన్నిరికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఎన్నో రికార్డులు ఆయన పేరుమీదే ఉన్నాయి. ముఖ్యంగా ''థ్రిల్లర్'' ఆల్బమ్ సంగీత ప్రపంచంలో ఎవర్ గ్రీన్‌. 1982 న‌వంబ‌ర్ 30న విడుదలైన ఈ ఆల్బమ్ అప్పటి నుంచి నేటి వ‌ర‌కూ అత్యధిక ఆదర‌ణ పొందిన ఆల్బమ్‌గా రికార్డులో ఉంది‌. ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మైఖేల్‌ జాక్సన్‌ తన రంగూ రూపూ మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. చర్మాన్ని బ్లీచ్‌ చేసుకోవడమే కాక ముఖాకృతి మార్చుకోవడానికి పలు శస్త్రచికిత్సలూ చేయించుకున్నాడు. జాక్సన్‌ అలా చేయించుకోవడానికి ముఖ్య కారణం కూడా లేకపోలేదు. 
 
ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు కాన్రాడ్‌ ముర్రే వెల్లడించారు. జాక్సన్‌ అమెరికన్‌ ఆఫ్రికన్‌ కుటుంబానికి చెందిన వాడు. జాక్సన్‌ని చిన్నప్పుడు తండ్రి జో జాక్సన్‌ ఫ్యాట్‌ నోస్‌ అని వెక్కిరించేవాడట. కుటుంబాన్ని పోషించడం కోసం జో చిన్న చిన్న పనులు చేసేవాడు. తన అసహాయత, కోపం అన్నిటినీ కుమారుడి మీద ప్రదర్శించేవాడు. తిట్టడం, కొట్టడంలాంటి పనులు చేసేవాడు. 
 
బాల్యంలోనే తీవ్ర నిరాదరణకు, హింసకు గురైన జాక్సన్‌ తండ్రికి సంబంధించిన ఆ చెడు జ్ఞాపకాలను చెరిపేసుకోవాలని తన రంగూ రూపూ మార్చుకునేందుకు ప్రయత్నించేవాడని డాక్టర్‌ ముర్రే పేర్కొన్నారు. ఒక దశలో చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా ఏవీ గుర్తు రాకుండా ఉండాలని బ్రెయిన్‌ సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నాడని ఆయన వెల్లడించాడు. వ్యక్తిగత వైద్యుడిగా తాను చికిత్స చేస్తున్నప్పుడు జాక్సన్‌ ఈ విషయాలను తనతో పంచుకున్నట్లు డాక్టర్‌ కాన్రాడ్‌ ముర్రే తెలిపారు.