Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్లియోపాత్రనే మెప్పించిన కలబంద.. ఆరు వేల సంవత్సరాలుగా మనిషికి ఉత్తమ సేవ

హైదరాబాద్, శుక్రవారం, 12 మే 2017 (07:49 IST)

Widgets Magazine

గ్రామాల్లో పొలాల గట్లపై, వాగుల్లో, బంజరభూముల్లో విస్తారంగా పెరుగుతోంది. తొలుత ఈ మొక్కలను పిచ్చిమొక్కలుగా వదిలివేసిన ప్రజలు నేడు వాటి విలువ తెలుసుకొని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇతర దేశాలలో కలబందకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌, చెన్నై, ముంబైవంటి పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి వీటిని కొనుగొలు చేస్తుండటంతో ప్రజలు వీటి పెంపకంపట్ల ఆసక్తి చూపుతున్నారు.
 
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి సిద్ధ ఔషధాలపై ఏర్పడిన ఆసక్తి వలన కలబందలోవున్న లక్షణాల ఆధారంగా ఎన్నో రకాల ఔషధ, చర్మ రక్షణ, సౌందర్య పరిరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి కృషిచేసి సఫలీకతులయ్యారు శాస్తజ్ఞ్రులు. ఇరాన్‌, ఈజిప్టు, గ్రీకు దేశాలలో పురాతన కాలంలోనే కలబందను నిత్యజీవితంతో భాగంగా పరిగణించి వినియోగించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. హిందు మతానికి మూలమైన వేదాలలో, క్రైస్తవ గ్రంథమైన బైబిల్‌లో కలబందను ప్రస్తావించారు. క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ యుద్ధంలో గాయపడిన సైనికులు గాయాలపై దీనిని వాడినట్లు వున్నాయి.
 
ఈజిప్టురాణి క్లియోపాత్ర తమ చర్మాన్ని మృదువుగా, అందంగా వుండటానికి దీనిని వాడినట్లు చరిత్ర చెబుతోంది. అలోవెరాని జూస్‌గా తాగటం వల్ల దీర్ఘకాలం ఆరోగ్యంగా వుండవచ్చునని అంటున్నారు. ఇందులో 15 రకాల పోషక పదార్ధాలు మిళితమై మానవ శక్తిని ప్రసాదిస్తాయి. ఎక్కువ సల్ఫర్‌ కలిగివుండే వెల్లుల్లి జాతికి చెందిన కలబంద ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచే మానవ జాతికి ఎంతో ఉత్తమ సేవలను అందిస్తున్నది. దీనిలోవుండే 200లకుపైగా చురుకైన మూలకాలు మానవ శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి.
 


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మీ ఇంట్లో పూలచెట్లు లేవా...? ఐతే ఆ శక్తి...

ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, తర్వాత పెళ్లిళ్లు... పిల్లలు... ఇలా బిజీ అయిపోతున్నారు. ...

news

పుట్టబోయే బిడ్డ అబ్బాయా.. అమ్మాయా.. ఇలా తెలుసుకోవచ్చు

పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ వుంటుంది. అయితే తల్లి బీపీ ...

news

ఊబకాయంతో బాధపడేవాళ్లకు మేలు చేసే బిర్యానీ ఆకులు

బిర్యానీ ఆకుల గురించి మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిర్యానీ ఆకులను ...

news

మధుమేహం ఉన్నవాళ్లు మామిడిపండు ముట్టకూడదా.. ఎవరు చెప్పారు?

మామిడి పండు ఫలాల్లో శ్రేష్టమైన పండు. దీంట్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ...

Widgets Magazine