గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:38 IST)

క్యాప్సికమ్‌లో నిమ్మరసం కలిపి..?

క్యాప్సికమ్ అనారోగ్య సమస్య నుండి కాపాడుతుంది. క్యాప్సికమ్ రకాలు.. నారింజ, ఎరుపు, పచ్చ, పసుపు వంటి రంగుల్లో ఉన్నాయి. ఈ మూడింటి కంటే పచ్చరంగు క్యాప్సికమ్‌నే ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి, ప్రోటీన్స్, మినరల్స్ వంటి లవణాలు అధిక మోతాదులో ఉంటాయి. క్యాప్సికమ్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర నొప్పులను తగ్గించుటకు చాలా దోహదపడుతాయి.
  
 
క్యాప్సికమ్‌ను చిన్న చిన్నవిగా కట్ చేసుకుని ఓ రెండు నిమిషాల పాటు నీటిలో ఉడికించుకోవాలి. ఆ తరువాత బాణలిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కొబ్బరి తురుము, కరివేపాకు, కొత్తిమీర, నూనె, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ తయారుచేసిన మిశ్రమంలో వేడివేడి అన్నం కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అల్సర్ వ్యాధిని తగ్గించేందుకు ఈ మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది.
 
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని అదుపులో ఉంచుతుంది. హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయిన వారు కప్పు క్యాప్సికమ్ రైస్ తీసుకుంటే పోయినా ఎనర్జీ అంతా తిరిగి వస్తుంది. దాంతో చక్కని నిద్ర మీ సొంతమవుతుంది. క్యాప్సికమ్ తరచు డైట్‌లో చేర్చుకుంటే రక్తపోటు వంటి సమస్యలు రావు. 
 
ఈ క్యాప్సికమ్ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. ఎలాగంటే.. క్యాప్సికమ్‌ను పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, తేనె లేదా చక్కెర కలిపీ సేవిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముడతల చర్మం కూడా తొలగిపోతుందని నిపుణులు వెల్లడించారు.