ఈ ఆహారంతో రక్తహీనత(ఎనీమియా)కు చెక్...

సోమవారం, 16 జులై 2018 (15:50 IST)

శరీరంలో చాలినంత ర‌క్తం లేకపోతే (ఎనీమియా) అంటారు. దేహంలో తగినంత ఐరన్‌ లేకపోవడం, విటమిన్ లోపం కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. సరైన పోషకాహారం లేకపోవడమే రక్తహీనతకు దారితీస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువ‌వుతోంది.
Anemia
 
గోళ్లు తెల్లగా పాలిపోవడం, నాలుక మీద‌, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, బలహీనంగా ఉండటం, చిన్నచిన్న పనులకే అలసిపోవడం, ఆయాసం రావడం, ఏ ప‌ని చేయాల‌న్నా ఆసక్తి లేకపోవడం త‌దితరాల‌ను ర‌క్త‌హీన‌త ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే, ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 
 
* ఇనుము పుష్కలంగా ఉండే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌ను నిత్యం తీసుకోవాలి.
* రోజుమార్చి రోజు ఖచ్చితంగా తాజా ఆకుకూరలను తీసుకోవాలి. వీటిలో తోటకూర, పుంటి కూర‌, పాలకూర, మెంతి కూర వంటివి తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
* మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకోవడం వల్ల రక్తహీనత లేకుండా చూడొచ్చు. 
* సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. 
* బీట్‌రూట్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, ప్రొటీన్‌లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. 
* బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్-ఎ అధికంగా ఉంటుంది. బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.
* నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. 
* తేనె కూడా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. 
* అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
* సాధారణ ఉప్పు కంటే అయోడిన్ శాతం ఎక్కువగా ఉప్పును వాడటం ద్వారా ఇనుము లోపం వల్ల వచ్చే రక్త హీనతను నివారించవచ్చు.



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నేరేడు పండ్లలో బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే?

నేరేడుపండ్లలో సహజంగా ఉండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లను స్రవించేలా చేసి కాలేయం ...

news

కీరదోసను సలాడ్‌లో చేర్చుకుంటే.. హైబీపీ ఇట్టే తగ్గిపోతుంది..

కీరదోసను తీసుకోవడం ద్వారా బీపీ ఇట్టే తగ్గిపోతుంది. కీరదోసలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ...

news

వేడివేడి బజ్జీలొద్దు.. వేడివేడి సూప్‌లు ట్రై చేయండి..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. ...

news

పేగుల్లోని సూక్ష్మ క్రిముల నిర్మూలనకు కాన్‌బెర్రీలు

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో కాన్‌బెర్రీ పండ్లు ఒకటి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ...