తులసి ఆకులను పరగడుపున నమిలి తింటే ఏమవుతుంది?
తులసి. ఈ చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలలో ఔషధ గుణాలున్నాయని పలు పరిశోధనల్లో తేలిన విషయం. తులసి చెట్టు ఇంట్లో వుంటే ఔషధాల భాండాగారం వున్నట్లే అని పెద్దలు చెపుతారు. తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గుండె ఆరోగ్యానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు తులసి చాలా మంచిది. జ్వరం (యాంటీపైరేటిక్), నొప్పి (అనాల్జేసిక్) తదితర అనారోగ్య సమస్యలను నిరోధిస్తుంది.
పరగడుపున 4 తులసి ఆకులను తీసుకుంటే జలుబు-దగ్గు, అలర్జీ, మధుమేహం, రక్త సంబంధ సమస్యలు, క్యాన్సర్ మొదలైనవి నయమవుతాయి. కలుషిత నీటిలో కొన్ని తాజా తులసి ఆకులను వేయడం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు. రోజూ కొంతసేపు తులసి దగ్గర కూర్చుంటే శ్వాస సంబంధ, ఆస్తమా వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
రోజూ తులసి నీటిని తాగడం వల్ల ఒత్తిడి తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.