దంపుడు బియ్యంతో ఉబ్బసానికి చెక్

brown rice
Last Updated: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:33 IST)
ఇపుడు మార్కెట్‌లో దంపుడు బియ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం విరివిగా లభ్యమవుతున్నాయి. నిజానికి పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అంటున్నారు.

ముఖ్యంగా, ఈ బియ్యంలో ఉండే సెలీనియం ఉబ్బసంకు వ్యతిరేకంగా పని చేస్తుందని అంటున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మేరకు మెగ్నీషియం ఉంటుందని, ఈ బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణవాహికలో కేన్సర్ కారకాలను బయటకు పంపుతుందని చెబుతున్నారు.

ఇకపోతే, ఇందులో ఉండే థయామిన్‌, రైబోఫ్లేవిన్, సయనకోబాల్మిన్ అనే విటమిన్లు నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌‌రైస్‌ ‌ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ వారు పేర్కొంటున్నారు.దీనిపై మరింత చదవండి :