మంగళవారం, 14 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:55 IST)

పుల్లటి కాయతో తియ్యని వ్యాధికి చెక్...

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు లేరు. అందుకే భారత్‌ను ప్రపంచ దేశాలు మధుమేహ రోగుల రాజధానిగా పిలుస్తారు. అందుకే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే, ఈ తియ్యని వ్యాధికి పుల్లటి కాయతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఆ పుల్లటి కాయ ఏంటో తెలుసా. ఉసిరిక్కాయ. ఉసిరిని ఆరగిస్తూ.. తైలికైన యోగాసనాలు చేస్తే ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఉసిరి... ఆరోగ్య సిరి అనే విషయం ప్రతి ఒక్కిరికీ తెలుసు. ప్రతిరోజూ ఓ ఉసిరికాయను తింటే చక్కెర వ్యాధికి దూరంగా ఉండొచ్చట. ఈ విషయం పలు అధ్యయనాల్లో తేలింది. విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరిని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మధుమేహం కంట్రోల్‌లో ఉంటుందని తేల్చారు.