1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2014 (18:33 IST)

ఎసిడిటీని గణనీయంగా తగ్గించే ఏలక్కాయ!

సాధారణంగా ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని ఆరోగ్యం నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుందట. 
 
వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపులో ఒడుదొడుకులు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
     
జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. అలాగే, తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.