1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2014 (12:57 IST)

చెవిపోటు కనిపెట్టు..! వెల్లుల్లి రసం పట్టు..!

అది అర్థరాత్రి... అందరూ నిద్రించే సమయం.. మన ఇంట్లో పసిపాప మాత్రం లేచి కూర్చుని ఏడుస్తుంటుంది. పట్టి చూస్తే జ్వరం కూడా ఉండదు. ఎందుకో అర్థం కాదు. ఏం చేయాలో తెలియదు. ఇటువంటి సంఘటన సాధారణంగా పిల్లలు ఉండే అందరి ఇళ్లలోను ఏదో ఒక రోజు ఎదురవుతుంటుంది. 
 
అటువంటి సమయంలో పిల్లలకు కడుపునొప్పికానీ, చెవి నొప్పి కాని ఏర్పడి ఉండవచ్చు. కడుపునొప్పి అయితే పిల్లల చెయ్యి కడుపుపైకి వెళ్లిపోవుతుంది తద్వారా గుర్తించవచ్చు. అదే చెవినొప్పి అయితే గుర్తించడం కష్టం. 
 
అటువంటప్పుడు పసి పిల్లలను పడుకోబెడితే ఏడుస్తారు. భుజాన వేసుకుంటే ఉరుకుంటారు. అంతే అదే కొండగుర్తుగా పిల్లలకు చెవినొప్పి ఏర్పడినట్లు గుర్తించవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్లే చెప్పేస్తారు. 
 
మరి దీనికి వైద్యం ఎలా అంటారా... ఇంకేముందు. ఇంట్లో ఉండనే ఉందిగా వెల్లుల్లి.  వెల్లుల్లిపాయ రసం తీసి మూడు చుక్కలు చొప్పున రెండు చెవుల్లో వేస్తే సరి. అది లేదంటారా పండు జిల్లేడు ఆకులను వేడిచేసి, నులిపి, అందులో నుంచి వచ్చే రసం మూడు నాలుగు చుక్కలు చెవిలో వేయవచ్చు. 
 
అది కూడా కుదరకపోతే బాదం పప్పు నూనెను మూడు నాలుగు చుక్కలు వేసి, చెవిలో దూది పెట్టాలి. అంతే చెవినొప్పి, చెవిలో పోటు టక్కున మాయమవుతుంది.