శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (18:30 IST)

కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే వెల్లుల్లి: బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి!

వెల్లుల్లిపాయలోని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను కరిగించి ఒబిసిటీని దూరం చేస్తుంది. అజీర్ణం, జలుబు, చెవు నొప్పి, గ్యాస్ట్రిక్, మొటిమలు, రక్త హీనత, రక్తపోటు వంటి వ్యాధులను వెల్లుల్లి దరిచేరనివ్వదు. వెల్లుల్లిలో విటమిన్స్, అయోడిన్, సల్ఫర్, క్లోరిన్, ఆంటి యాక్సిడెంట్లు వంటి పోషకాలున్నాయి. 
 
ఇవి చర్మ వ్యాధులను దూరం చేస్తాయి. వెల్లుల్లి పేస్టును చర్మంపై మొటిమలు, అలర్జీలపై రాస్తే ఉపశమనం ఉంటుంది. ఇంకా మచ్చులు మాయమవుతాయి. రక్తపోటు ఉన్నవారు రోజు రాత్రి నిద్రించేందుకు ముందు వెల్లుల్లిని పాలతో ఉడికించి.. కాస్త ఆరాక తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. గుండెపోటు దూరమవుతుంది. రక్త నాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. 
 
అలాగే పాలలో వెల్లుల్లిని ఉడికించి ఊరగాయలా తయారుచేసుకుని తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోవడంతో పాటు అనవసరపు ఫ్యాట్ కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. వెల్లుల్లి రసంతో కాస్త కర్పూరాన్ని కలిపి మోకాలికి రాస్తే కీళ్ల నొప్పులు దూరమవుతాయి. అలాగే వెల్లుల్లి రసాన్ని చెవుల్లో ఐదారు చుక్కలు పోస్తే చెవునొప్పి నయం అవుతుంది. వెల్లుల్లి రసంలో కాస్త ఉప్పు కలిపి బెణికిన చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా వెల్లుల్లి, ఉల్లిపాయను రోజూ వంటల్లో చేర్చుకుంటే తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.