శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (15:10 IST)

చుండ్రు సమస్యకు అల్లంతో చెక్..!

ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి వస్తువులన్ని సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి. అల్లంను మెత్తని పేస్ట్‌లా చేసుకుని, దానికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది. 
 
చర్మం తరచూ పొడబారిపోతుంటే సోయాపిండిలో కొంచెం తేనె, కొద్దిగా పాలు కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారినికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
బొప్పాయి గుజ్జులో తేనె, పాలు, బాదం నూనె చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమంతో బాగా రుద్దుకుంటే చేతులు, కాళ్ళు ఎంతో మృదువుగా తయారవుతాయి. ఈ విధంగా ఇంటిలో లభించే వస్తువులనే ఉపయోగించి అందాన్ని మరింత పెంచుకోవచ్చు.