జామ ఆకులతో మేలు... జామ ఆకుల టీ తాగితే...

శనివారం, 16 సెప్టెంబరు 2017 (20:47 IST)

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి తెలుసా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! 
 
నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.
 
జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఏ పదార్థాల్లో ఏ విటిమిన్లు ఉంటాయంటే...?

చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా కొన్ని పదార్థాలను ...

news

శీర్షాసనం ఎవరు వేయకూడదు...? వేస్తే ఏంటి?

శీర్షాసనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆసనాన్ని నాలుగు కాళ్ళు కలిగిన ఇనుప చట్రంమీద ...

news

లేడీస్... కాఫీ, టీ తాగితే ఆ రిస్క్ కట్...

మధుమేహంతో బాధపడే మహిళలు ఏది తినాలన్నా భయంతో లెక్కలు కట్టుకుని తింటూ వుంటారు. మహిళలే కాదు ...

news

మొక్కజొన్న తింటే ఏమిటి?(వీడియో)

మొక్కజొన్న, వేరుశనగ, కొబ్బరి. ఆహారంలో భాగంగా ఈ మూడు పదార్థాలను తీసుకుంటే అనారోగ్యం ఆమడ ...

Widgets Magazine